సింగమనేని శ్రవణ్ కుమార్

సింగమనేని శ్రవణ్ కుమార్ గారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీద పల్లి లో వెంకటేశులు మరియు ప్రాభావతమ్మ గార్ల కు 12 may 1988 న జన్మించాడు.మొదటి ఐదు తరగతులు తన అమ్మమ్మ గారి వూరు అయిన కృష్ణాపురం గ్రామం లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి దాకా స్వగ్రామం బండమీద పల్లి లో చదువుకున్నాడు,తరువాత మాస్టర్ డిగ్రీ వరకు అనంతపురం లో చదువుకున్నాడు. శ్రవణ్ గారికి ఇద్దరు అక్కలు ప్రమీల, వనజాక్షి. శ్రవణ్ గారు డిగ్రీ చదువుతున్న సమయంలో ఇతని నాన్న వెంకటేశులు గారు అనారోగ్యం తో స్వర్గస్తులైనారు ,తల్లి ప్రభావతి గారు తన తండ్రి నారయనప్ప గారి ప్రేరణతో పిల్లలను ఎంతో కష్ట పడి విద్యావంతులుగా తీర్చి దిద్దింది. శ్రవణ్ కుమార్ గారు ఎబివిపి విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు, విద్యార్థి దశ లో కర్చుల కోసం తొలి మలి సంధ్యల లో పిల్లలకు టూషన్స్ చెప్పేవాడు, 2011 లో తన కంప్యూటర్స్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ ని శ్రీ వాణీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ (యస్ కే యు) నుంచి కంప్లీట్ చేశారు.