మందుల విప్లవకుమార్ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ప్రజాసేవకుడు.ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపినవాడు. ప్రసిద్ధ చారిత్రాత్మక విద్యార్థి సంఘం ఎస్.ఎఫ్.ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా,అధ్యక్షుడిగా,కేంద్రకమిటీ సభ్యునిగా పనిచేశాడు.ప్రస్తుతం DYFI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు.నిరుద్యోగ నిర్మూలనకు,ఉద్యోగాల కల్పనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్నాడు.ప్రకృతీ ప్రేమికుడు,పర్యావరణ రక్షకుడు కూడా.నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని చెంచుపెంటల నుంచి డిల్లీ వరకు ఉద్యమాల్ని లేవదీసినవాడు.కృష్ణా నది పరివాహక ప్రాంతమంతా పల్లె పల్లె తిరుగుతూ యురేనియం ప్లాంట్స్ కు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచాడు.ఆదివాసుల రక్షణ,అడవుల రక్షణ,జీవ వైవిధ్యం కాపాడే కృషి చేస్తున్న యాక్టివిస్ట్. సమస్యలపై వ్యాసాలు,పాటలు ఎప్పటికప్పుడు రాస్తుంటాడు. తెలంగాణ వ్యాప్తంగా అనేక యాత్రలు చేసిన నిత్య యాత్రికుడు.మీ వారసులకు ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాగోలా బ్రతికేస్తారు కానీ ఆక్సీజన్ ఇవ్వకపోతే ఎలాగూ బ్రతకలేరు. కాబట్టి మొక్కలు నాటండి ఆక్సీజన్ ఆస్తీగా ఇవ్వండి అని నినాదం ఇచ్చి తెలంగాణ అంతటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతం చేశాడు.అనేక అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాడు.నల్లగొండ లాంటి మున్సిపాలిటీల్లో వందలకోట్ల అవినితి భాగోతాలను బయటపెట్టాడు.ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయించే వరకు పోరాడాడు.అన్ ఎంప్లాయిమెంట్ పై పోరాడే క్రమంలో నిరుపయోగమవుతున్న ఎంప్లాయ్మెంట్ ఆఫీసులకు అనెంప్లాయ్మెంట్ ఆఫీసులుగా బోర్డ్ తగిలించి సంచలనం చేశాడు. కులాంతర,ప్రేమ వివాహాలు జరిపిస్తున్నాడు. కుల నిర్మూలనకు కృషి చేస్తున్నాడు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై, ప్రేమికులపై దాడులను ప్రతిఘటించడంలో ముందు నిలుస్తున్నాడు.
విప్లవ కుమార్ మందుల
DYFI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
1-8-538/4, చిక్కడపల్లి,
హైదరాబాద్ 500020.
జననం: జూన్ 4, 1985
తల్లిదండ్రులు: మందుల లింగయ్య,నీలమ్మ
మతం: నాస్తికం
చదువు: ఎం.ఎ, ఎల్.ఎల్.బి
గ్రామం: చెర్వుఅన్నారం
మండలం: కట్టంగూర్
జిల్లా: నల్లగొండ - 508205
రాష్ట్రం: తెలంగాణ