సంస్కృత సాహిత్య ప్రపంచంలో ప్రాధమిక అంలకారికుడు శ్రీ మమ్మటాచార్యులు. అష్టమ శతబ్దీయులు అయిన వీరు గొప్ప వైయ్యాకరణ విద్వాంసులు. కావ్యప్రకాశము మరియు శబ్దవ్యాపారవిచారం అను మహా గ్రంథములను రచించినాడు. కాశ్మీరవాసి అయిన మమ్మటుడు రాసిన కావ్యప్రకాశంలో దశోల్లాసాలు ఉన్నాయు. అందులో ప్రథమ ఉల్లాసంలో కావ్యలక్షణాలు, భేధాలు, ప్రయోజనాలు ఇత్యాది విషయాలు ఉన్నాయు. రసవిషయంలో స్థాయి, విభావ, అనుభావ, వ్యభిచార భావాలను వివరించాడు. మిగిలిన అంలంకారికుల వలె ఈయన దశగుణాలు కాక మూడు గుణాలు అనగా మాధుర్య, ఓజ, ప్రసాదాలు మాత్రమే అంగీకరించారు. శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు అంగీకరించాడు.